శరవణ భవన్ రాజగోపాల్ మృతి

ప్రఖ్యాత హోటల్ చైన్స్ ‘శరవణ భవన్’ రాజగోపాల్ ఇవాళ తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులతో పాటు ఆమె భర్తను కిరాయి గూండాలతో హత్య చేయించిన కేసులో ఆయనకు జీవిత ఖైదు విధించారు.

పలుమార్లు ఆయన వివిధ కోర్టులకు వెళ్ళినా ఆయన శిక్షలో మార్పు చేయలేదు. వెంటనే లొంగిపోమ్మని ఆదేశించింది. దీంతో ఆయన జులై 8న కోర్టు ముందు లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటు గుండెపోటు రావడంతో విజయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.