వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్న శర్వానంద్

ఈమధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో శర్వానంద్… ఇప్పుడు ‘రణరంగం’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత శర్వానంద్ ’96’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో స్కై డ్రైవింగ్ సీన్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో శర్వానంద్ తీవ్రంగా గాయపడ్డాడు. భుజానికి ఆపరేషన్ కూడా చేయించుకున్న శర్వానంద్ కి వైద్యులు రెండు నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు.

అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మాత్రం రణరంగం సినిమా షూటింగ్ లో మిగిలిపోయిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడట.

అంతేకాకుండా ’96’ రీమేక్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడట. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ’96’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా పూర్తయిన తర్వాత…. శర్వానంద్ సెప్టెంబర్ నుంచి ‘శ్రీకారం’ అనే మరొక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు.