టీడీపీలోకి యూటర్న్…. బీజేపీకి షాకిచ్చారు….

పచ్చ కండువాలు బీజేపీ పట్టు జారిపోతున్నాయి. నలుగురు రాజ్యసభ ఎంపీల చేరిక తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలంతా గంపగుత్తగా బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తాయి.

కానీ ఇప్పుడు టీడీపీ నేతలెవరూ బీజేపీ వైపు వెళ్లకపోవడంతో…. ఆ పార్టీ అధిష్టానం ఎందుకు అనే విషయం పై దృష్టిసారించిందట. నెల రోజుల క్రితం వస్తామన్నవారు ఇప్పుడు ఎందుకు రావడం లేదనే విషయంపై ఏపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయింది. కేవలం 23మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో అందరూ పక్కచూపులు చూడడం మొదలు పెట్టారు. అధికార వైసీపీలోకి వెళదామంటే జగన్ రాజీనామా చేసి రమ్మంటాడు. అందుకే ఇప్పుడు బీజేపీవైపు చూశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, కాపు నేతలు, రాయలసీమకు చెందిన నేతలు బీజేపీతో సంప్రదింపులు కూడా జరిపి చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు వారంతా చేరడం లేదన్న వార్త బీజేపీని షాక్ కు గురిచేస్తోంది.

ఇటీవలే అనంతపురం, ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు…. టీడీపీ నేతల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికసాయం కూడా చేశారు.

బాబు పర్యటనతో…. అసలు ఉనికి లేని బీజేపీలో చేరడం కంటే ఓటు బ్యాంకు బాగా ఉన్న టీడీపీయే బెటర్ అన్న వాస్తవానికి టీడీపీ నేతలు వచ్చినట్టు తెలిసింది. అందుకే బీజేపీలో చేరితే గెలవడం కష్టమన్న భావనతోనే బీజేపీలోకి వెళ్లాల్సిన వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.