Telugu Global
NEWS

నిరాశ, నిస్పృహలో తెలంగాణ కాంగ్రెస్.... సోనియాకు సుధీర్ఘ లేఖ

బీజేపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఇచ్చింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రాల్లో చాన్నాళ్ల పాటు బీజేపీనే ఎన్నికల్లో గెలుస్తూ అధికారం చెలాయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందని తెలిసినా సరే ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. మరో వైపు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ను […]

నిరాశ, నిస్పృహలో తెలంగాణ కాంగ్రెస్.... సోనియాకు సుధీర్ఘ లేఖ
X

బీజేపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఇచ్చింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రాల్లో చాన్నాళ్ల పాటు బీజేపీనే ఎన్నికల్లో గెలుస్తూ అధికారం చెలాయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రా ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందని తెలిసినా సరే ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగింది. మరో వైపు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ను ఆదుకునే నాథుడే లేకుండా పోయాడు. ఇక జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా అస్త్ర సన్యాసం చేసేశాడు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. తమ భవిష్యత్ ఏమిటో తెలియని గందరగోళ స్థితిలో పడిపోయారు.

దీంతో పార్టీ సీనియర్లు కొందరు కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశారు. గత కొన్నాళ్లుగా ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ ప్రణాళికపై తీవ్రంగా చర్చించిన అనంతరం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి ఒక సుదీర్ఘమైన లేఖను బుధవారం రాశారు.

తెలంగాణ ఇచ్చినా రెండు సార్లు అధికారంలోకి రాలేకపోయామని.. దీనికి పార్టీని నమ్ముకున్న వాళ్లకు టికెట్ ఇవ్వకపోవడమే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్యారాచూట్ నేతలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అసలైన కార్యకర్తలను వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో మూడు సీట్లు రాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ మాత్రం 4 పార్లమెంటు సీట్లు గెలుచుకుందని వారు గుర్తు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వారు వివరించారు. త్వరగా ఏఐసీసీ అధ్యక్షుడిని నియమించాలని వారు కోరారు. లేఖ రాసిన వారిలో మర్రి శశిధర్ రెడ్డి, వీహెచ్, కమలాకర్ రావు, చంద్రశేఖర్, నిరంజన్, శ్యామ్ మోహన్ తదితరులు ఉన్నారు.

First Published:  17 July 2019 8:19 PM GMT
Next Story