Telugu Global
NEWS

మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..!

తెలంగాణ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇవాళ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం ఎందుకింత హడావిడిగా ఎన్నికలు నిర్వహించుకోవాలని భావిస్తోందో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఇవ్వాళ విచారించింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉండగానే ఎందుకింత హడావిడి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మున్సిపాలిటీలు, పక్కన గ్రామాల ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎందుకు ఇంత తొందరపడుతున్నారని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కాగా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని…  […]

మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు..!
X

తెలంగాణ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇవాళ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం ఎందుకింత హడావిడిగా ఎన్నికలు నిర్వహించుకోవాలని భావిస్తోందో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం ఇవ్వాళ విచారించింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు గడువు ఉండగానే ఎందుకింత హడావిడి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

మున్సిపాలిటీలు, పక్కన గ్రామాల ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఎందుకు ఇంత తొందరపడుతున్నారని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది.

కాగా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని… అభ్యంతరాలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు… రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. అయితే సమగ్ర వివరాలతో కౌటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అయితే ఇప్పటికే పలు అభ్యంతరాలు, అనుమానాల నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియపై కోర్టు స్టే ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం సరైన కౌంటర్ దాఖలు చేయలేకపోతే ఏకంగా మున్సిపల్ ఎన్నికలే వాయిదా పడే పరిస్థితి నెలకొంది.

First Published:  18 July 2019 9:26 AM GMT
Next Story