‘సరైనోడు’ టీమ్…. మరోసారి కలుస్తుందా?

టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ దర్శకులలో బోయపాటి శ్రీను కూడా ఒకరు. అయితే ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ తర్వాత నిర్మాతలే కాదు స్టార్ హీరోలు కూడా బోయపాటి తో సినిమా అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఆ సినిమా విడుదలై 5 నెలలు అయింది… కానీ ఇంకా బోయపాటి తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం మెగా నిర్మాత అల్లు అరవింద్ బ్యానర్ లో బోయపాటి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా చెప్పాడు కూడా.

ఈ సినిమాలో హీరో గురించి ఇప్పటికే బోలెడు పేర్లు బయటకు వచ్చాయి. కానీ వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం గీత ఆర్ట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఇలాంటి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.