Telugu Global
NEWS

బీసీసీఐ ఎంపిక సంఘం సమావేశం వాయిదా

విండీస్ టూర్ కు ఆదివారం భారతజట్టు ఎంపిక ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ లకు చోటు లేనట్లే కరీబియన్ ద్వీపాలలో జరిగే తీన్మార్ వన్డే, టీ-20, రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేసినట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. వాస్తవానికి…భారత జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ ఈరోజు ముంబైలో సమావేశం కావాల్సి ఉంది. ఎంపిక సంఘం సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి నేతృత్వం వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే…పాలకమండలి ఈ సాంప్రదాయాన్ని […]

బీసీసీఐ ఎంపిక సంఘం సమావేశం వాయిదా
X
  • విండీస్ టూర్ కు ఆదివారం భారతజట్టు ఎంపిక
  • ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ లకు చోటు లేనట్లే

కరీబియన్ ద్వీపాలలో జరిగే తీన్మార్ వన్డే, టీ-20, రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేసినట్లు బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి.

వాస్తవానికి…భారత జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ ఈరోజు ముంబైలో సమావేశం కావాల్సి ఉంది. ఎంపిక సంఘం సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి నేతృత్వం వహించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే…పాలకమండలి ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి…ఎంపిక సంఘం చైర్మన్ మాత్రమే సెలెక్షన్ కమిటీ సమావేశానికి నేతృత్వం వహించాలని ఆదేశించింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి అనిరుద్ చౌదరీ.. జట్టు ఎంపిక సమావేశానికి దూరంగా ఉండక తప్పలేదు.

ఆగస్టు 3 నుంచి టీ-20 సిరీస్

కరీబియన్ ద్వీపాల పర్యటనలో భాగంగా భారతజట్టు ఆగస్టు 3 నుంచి 6 వరకూ జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గోనుంది.
ఆగస్టు 8 నుంచి 14 వరకూ మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది.

ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 3 వరకూ రెండు మ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ సమరం జరుగనుంది.

విరాట్ కొహ్లీకి నో రెస్ట్…

విండీస్ టూర్ లో భారతజట్టుకు మొత్తం మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కొహ్లీనే నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.
వన్డే, టీ-20 సిరీస్ ల్లో రోహిత్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పి..కొహ్లీకి విశ్రాంతి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ..అలాంటి ఆలోచన ఏమీలేదని…బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

ఆదివారం జరిగే ఎంపిక సంఘం సమావేశంలో ధోనీని పక్కనపెట్టి..రిషభ్ పంత్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ లో దారుణంగా విఫలమైన మిడిలార్డర్ ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్ లను సైతం పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

First Published:  19 July 2019 1:06 AM GMT
Next Story