ట్రైలర్ ఓకే…. ఈ సినిమా అయినా కాపాడేనా?

ఈ మధ్యనే ‘సీత’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్… ఇప్పుడు రమేష్ వర్మ  అనే దర్శకుడితో చేతులు కలిపి ‘రాక్షసుడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘రాట్సాసన్’ సినిమా కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సినిమా ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ ఇచ్చింది.

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి తగ్గట్టుగానే…. ఈ సినిమా కొందరిని కిరాతకంగా హత్య చేసిన ఒక సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) చుట్టూ తిరుగుతుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా…. మరి తెలుగులో బెల్లంకొండ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల రెండవ తేదీన విడుదల కాబోతుంది.