మెగా క్యాంప్ లోకి…. కార్తికేయ !

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తికేయ తరువాతి సినిమాలతో తన ఇమేజ్ ను నిలుపుకోలేకపోయాడు.

‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత ‘హిప్పీ’ అనే బైలింగ్వల్ సినిమాలో నటించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇక కార్తికేయ ‘గుణ 369’ ఒక యాక్షన్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంతే కాకుండా నాని హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం కార్తికేయ కి ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ‘గుణ 369’ సినిమా ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “వెల్కమ్ టు గీత ఆర్ట్స్ కార్తికేయ” అని అన్నారు. అంటే కార్తికేయ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ త్వరలో ఒక సినిమా నిర్మించబోతోంది అనే కదా అని కొందరు అంటున్నారు.

అయితే దీని గురించిన క్లారిఫికేషన్ మాత్రం అల్లు అరవింద్ ఇవ్వలేదు. కానీ కార్తికేయ త్వరలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పెద్ద బ్యానర్ లో సినిమా…. కార్తికేయకు ఏ రెంజ్ హిట్ ఇస్తుందో చూడాలి.