ప్రకాష్ కోవెలమూడి… క్రిష్ జాగర్లమూడి… అనిల్ రావిపూడి…!

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇటీవలే ఒక సినిమా ని అనౌన్స్ చేశాడు. అయితే ఆయన ఈ సినిమా కి దర్శకత్వం చేయడం లేదు కానీ స్క్రిప్ట్ ని దగ్గరుండి తయారు చేయించుకుంటున్నాడు.

గోపి మోహన్, బీవీఎస్ రవి ల తో కలిసి స్క్రిప్ట్ రెడీ చేయించుకొని, ముగ్గురు దర్శకుల తో ఈ సినిమా చేయాలని ఆయన ప్లాన్. ఈ సినిమా లో హీరోగా నాగ శౌర్య దాదాపుగా ఖరారు అయినట్లే.

అయితే ముగ్గురు దర్శకుల్లో క్రిష్ మరియు ప్రకాష్ కోవెలమూడి ఫిక్స్ అయ్యారు… కానీ మూడో దర్శకుడి విషయమై ఇంకా ఒక ప్రకటన రాలేదు.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా లో మూడో దర్శకుడు అనిల్ రావిపూడి అని అంటున్నారు. అనిల్ కొన్ని ఇంటర్వ్యూలలో రాఘవేంద్ర రావు స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు. అందుకే తనని అప్రోచ్ అయిన వెంటనే అనిల్ ఈ సినిమా చేస్తా అని చెప్పినట్లు సమాచారం.

స్క్రిప్ట్ కి ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నారు దర్శక నిర్మాతలు. త్వరలో నే ఈ సినిమా గురించి ఒక అధికారిక ప్రకటన రానుంది.