అజయ్ భూపతి మల్టీ స్టారర్…. రవితేజను కాపాడేనా?

ప్రస్తుతం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సీనియర్ హీరోల్లో ముందున్న వ్యక్తి రవి తేజ. వరుస పరాజయాల తర్వాత ఏ సినిమా తో ముందుకు వెళ్తే బాగుంటుంది అనే విషయం మీద క్లారిటీ లేకుండా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. అయితే ప్రస్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న రవితేజ, ఈ సినిమా పైన భారీ అంచనాలని పెట్టుకున్నాడు.

ఇకపోతే రవితేజ తదుపరిగా అజయ్ భూపతి దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత చాలా మంది హీరోల దగ్గరకి తన కథని తీసుకొని వెళ్ళి…. ఆల్మోస్ట్ సినిమా చేసే స్థాయి కి వెళ్ళి …. అనివార్య కారణాల వలన బయటకి వచ్చిన సందర్భాలని చాలా చూశాడు అజయ్. చివరికి రవి తేజ తో తన సినిమా ఒకే చేయించుకున్న ఈ దర్శకుడు త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడని తెలుస్తుంది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా మల్టీ స్టారర్ అంట. రవి తేజ తో పాటు హీరో సిద్దార్థ్ కూడా ఈ సినిమా లో నటించనున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత సిద్దార్థ్ ఇలా ఒక పక్కా తెలుగు సినిమా లో నటించబోతున్నాడు. అదితి రావ్ హైదరి ఈ సినిమా లో హీరోయిన్ గా చేయనుంది.