శృతిహాసన్…. తన కోరికను ఇలా బయటపెట్టింది….

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసిన ఈ భామ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో శృతిహాసన్ షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈమధ్య సోషల్ మీడియాలో ‘ఫేస్ యాప్’ లో మన మొహాలు ముసలి వారి గా మారి పోతే ఎలా ఉంటాయో చూపించే యాప్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా శృతి హాసన్ కూడా ఈ యాప్ వాడడం మొదలు పెట్టింది. ఆ యాప్ లో వచ్చిన తన ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, నా జీవితానికి, నా పదిమంది మనవళ్లు మనవరాళ్లకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అందమైన ఇళ్ళకి కృతజ్ఞురాలిగా ఉంటాను. కానీ నేనింకా మనసులో మాత్రం యంగ్ గానే ఉంటాను?” అంటూ సరదాగా క్యాప్షన్ పెట్టింది.

దీనిద్వారా శృతిహాసన్ ప్రపంచవ్యాప్తంగా బోలెడు ఇల్లులు కొనుక్కోవాలని, తనకి పదేసి మంది మనవళ్లు-మనవరాళ్లు ఉండాలని కోరుకుంటుందని తెలుస్తోంది.