టిక్‌టాక్ వీడియోలతో తెలంగాణ స‌ర్కార్ ప‌రేషాన్‌!

టిక్‌టాక్ వీడియోల క‌ల్చ‌ర్ పెరిగిపోయింది. ఇళ్లు దాటి ఆఫీసులు చేరిపోయాయి. మొన్న‌టికి మొన్న ఖ‌మ్మం కార్పొరేష‌న్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన టిక్‌టాక్ వీడియోలు క‌ల‌క‌లం రేపాయి. ప‌నిమానేసి ఉద్యోగులు వీడియోలు రూపొందిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. దీంతో తొమ్మిది మంది ఉద్యోగుల‌పై క‌మిష‌న‌ర్ వేటు వేశారు.

ఇప్పుడు తాజాగా తెలంగాణ స‌ర్కార్‌కు ఒక టిక్‌టాక్ వీడియో షాక్ ఇచ్చింది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ మనవడు పుర్కాన్ అహ్మద్ స‌ర‌దాగా చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

హోంమంత్రికి కేటాయించిన అధికారిక వెహిక‌ల్ ఎక్కి మ‌న‌వ‌డు చేసిన వీడియో ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ వివాదాస్ప‌ద వీడియో…. పోలీసు సెక్యూరిటీ ప‌క్క‌నే ఉండ‌గా చేయ‌డంపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.