మోడీ ఎలా గెలిచాడో…. కేసీఆర్ అలాగే గెలిచాడు….

నరేంద్రమోడీ గెలవడానికి అనర్హుడంటూ కేసీఆర్ తాజాగా తన కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి, బీసీ కార్డును ప్లే చేసి గెలిచిన మోడీది గెలుపేకాదంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.

అయితే తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలకు ఫేస్ బుక్ ద్వారా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, నటి విజయశాంతి. మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు నైతిక హక్కులేదని ఆమె కుండబద్దలు కొట్టారు.

మోడీ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి గెలిస్తే.. కేసీఆర్ 2014లో ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచాడని ఆక్షేపించారు. 2019లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసాడని ఆంధ్రా పాలన అవసరమా? అని ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడని దుయ్యబట్టారు. మరి మోడీది గెలుపు కానప్పుడు…. కేసీఆర్ ది కూడా గెలుపే కాదని స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు రాజకీయంగా భవిష్యత్ ప్రశ్నార్థకమైన వేళ విజయశాంతికి సినిమాల్లో మరోసారి అవకాశం వచ్చింది. మహేష్ బాబు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారామే.. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో విజయశాంతి నిలదొక్కుకుంటారా లేదా అన్నది చూడాలి.

నరేంద్ర మోదీది ఓ గెలుపా?…ఏం అభివృద్ధి చేశారని మోదీ మళ్లీ గెలిచారు?…కేవలం దేశభక్తి పేరుతో సెంటిమెంట్ ను రగల్చి……

Posted by Vijayashanthi on Thursday, 18 July 2019