Telugu Global
Others

సత్యంపై బన్నీ దురుసు ప్రవర్తనకు అసలు కారణం

నటుడు అల్లు అర్జున్‌ షూటింగ్ సమయంలో సీనియర్ కో డైరెక్టర్‌ సత్యం పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సెట్‌లో కో డైరెక్టర్‌ ముఖంపైకి అల్లు అర్జున్‌ కాగితాలను విసిరి కొట్టి దురుసుగా ప్రవర్తించాడు. దాంతో నొచ్చుకున్న కో డైరెక్టర్ తమ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. వ్యవహారం అంత దూరం వెళ్లకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అసలు అల్లు అర్జున్ అలా ఎందుకు వ్యవహరించారన్న దానిపై ఆ సమయంలో సెట్‌లో ఉన్న […]

సత్యంపై బన్నీ దురుసు ప్రవర్తనకు అసలు కారణం
X

నటుడు అల్లు అర్జున్‌ షూటింగ్ సమయంలో సీనియర్ కో డైరెక్టర్‌ సత్యం పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సెట్‌లో కో డైరెక్టర్‌ ముఖంపైకి అల్లు అర్జున్‌ కాగితాలను విసిరి కొట్టి దురుసుగా ప్రవర్తించాడు. దాంతో నొచ్చుకున్న కో డైరెక్టర్ తమ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. వ్యవహారం అంత దూరం వెళ్లకుండా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

అసలు అల్లు అర్జున్ అలా ఎందుకు వ్యవహరించారన్న దానిపై ఆ సమయంలో సెట్‌లో ఉన్న వారు వివరాలు వెల్లడిస్తున్నారు. షాట్‌కు అంతా సిద్ధం కాగానే కో డైరెక్టర్ సత్యం వెళ్లి బన్నీని రెండు సార్లు పిలిచినా హీరో స్పందించలేదని చెబుతున్నారు. మూడో సారి కూడా వెళ్లి పిలువగా కోపంతో ఊగిపోతూ కాగితాలను సత్యం ముఖం మీద కొట్టాడు అల్లు అర్జున్.

దాంతో నొచ్చుకున్న సత్యం సెట్ నుంచి వెళ్లిపోయారు. చాలాసేపు షూటింగ్ ఆగిపోయింది. అయితే అల్లుఅర్జున్ టీం ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. షూటింగ్ ఉండడంతో అల్లు అర్జున్ మరో మీటింగ్‌ను వాయిదా వేసుకున్నారని… కానీ తీరా షూటింగ్‌కు వచ్చిన తర్వాత షాట్‌కు షాట్‌కు మధ్య గ్యాప్‌ ఉంటుందని సత్యం చెప్పారని దాంతో అల్లు అర్జున్‌కు కోపం వచ్చిందని చెబుతున్నారు.

అలా గ్యాప్ ఉంటుందని చెప్పి ఉంటే తాను మీటింగ్‌కు వెళ్లి వచ్చేవాడినని.. కానీ సరిగా ఇన్‌ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల తన ప్లాన్ పాడైందన్నదే అల్లు అర్జున్ ఆవేదన అని ఆయన టీం చెబుతోంది. అయితే సన్నివేశంలో అల్లు అర్జున్‌తో పాటు నటించాల్సి ఉన్న ఒక సీనియర్ యాక్టర్‌ మరో షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఆయన కోసం కాసేపు షూటింగ్ ఆపారని… అలా ఎవరి కోసమో తనను ఎదురు చూసేలా చేయడంతో అల్లు అర్జున్‌కు కోపం వచ్చిందని మరో వివరణ కూడా వినిపిస్తోంది.

First Published:  20 July 2019 4:40 AM GMT
Next Story