నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ స్టూడెంట్స్

బూతు షోగా విమర్శలు ఎదుర్కొంటున్న బిగ్‌బాస్‌పై వివాదాల ముసుగు వీడడం లేదు. ఈ షోను వెంటనే నిషేధించాలంటూ మహిళా, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టులో కేసులు కూడా నమోదు అయ్యాయి.

మహిళలను కించపరిచేలా, మహిళలను ఆటవస్తువులా, రేటింగ్ పాయింట్‌లా చూస్తున్న షోపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నటుడు నాగార్జున ఇంటిని ఓయూ స్టూడెంట్స్ ముట్టడించారు. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ బూతు షో నుంచి బాధ్యతాయుతమైన వ్యక్తిగా నాగార్జున తప్పుకోవాలని స్డూడెంట్స్ డిమాండ్ చేశారు.

మహిళలను కించపరిచే షోలో పాల్గొనేందుకు నాగార్జున ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. బిగ్‌బాస్‌లో లైంగిక వేధింపులు లేవని నాగార్జున చెప్పగలరా? అని విద్యార్థులు ప్రశ్నించారు.

నాగార్జున ఇంటిని ఓయూ స్టూడెంట్స్ ముట్టడి గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.