Telugu Global
Cinema & Entertainment

'ఓ బేబీ' ఓవర్సీస్ కలెక్షన్స్

గత కొంతకాలంగా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని…. తాజాగా ‘ఓ బేబీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సౌత్ కొరియా లో సూపర్ హిట్ అయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకి రీమేక్ గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. […]

ఓ బేబీ ఓవర్సీస్ కలెక్షన్స్
X

గత కొంతకాలంగా కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని…. తాజాగా ‘ఓ బేబీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా సౌత్ కొరియా లో సూపర్ హిట్ అయిన ‘మిస్ గ్రానీ’ సినిమాకి రీమేక్ గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.

సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉంది అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎప్పుడో విడుదలైన ఈ సినిమా తాజాగా రెండు రోజుల క్రితమే 900 కే క్లబ్ లో జాయిన్ అయింది.

ఓవర్సీస్ లో ఓ బేబీ సినిమా విడుదలైన మూడు వారాల తరువాత కలెక్షన్లు 914కే డాలర్లకు చేరింది. అయితే ఈ మధ్యకాలంలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ‘ఏజెంట్ ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల వల్ల ‘ఓ బేబీ’ సినిమాకి కలెక్షన్లు ఆలస్యం అయ్యాయి అని చెప్పుకోవచ్చు. లేకపోతే సమంత సినిమా ఎప్పుడో 1.5 మిలియన్ డాలర్లకు చేరి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలయ్యే వరకు ‘ఓ బేబీ’ చిత్రానికి ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

First Published:  20 July 2019 12:30 AM GMT
Next Story