Telugu Global
NEWS

భారత చెస్ లో 64వ గ్రాండ్ మాస్టర్

15 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా ప్రీతు గుప్తా భారత చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. ప్రపంచ చాంపియన్, సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎందరో క్రీడాకారులు చెస్ క్రీడలో అడుగుపెడుతున్నారు. అత్యంత క్లిష్టమైన గ్రాండ్ మాస్టర్ హోదాను అలవోకగా సాధిస్తున్నారు. ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు ప్రీతు గుప్తా…భారత 64వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరాడు. 2019 పోర్చుగీసు లీగ్ […]

భారత చెస్ లో 64వ గ్రాండ్ మాస్టర్
X
  • 15 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా ప్రీతు గుప్తా

భారత చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ల సంఖ్య ఏడాది ఏడాదికీ పెరిగిపోతోంది. ప్రపంచ చాంపియన్, సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఎందరో క్రీడాకారులు చెస్ క్రీడలో అడుగుపెడుతున్నారు. అత్యంత క్లిష్టమైన గ్రాండ్ మాస్టర్ హోదాను అలవోకగా సాధిస్తున్నారు.

ఢిల్లీకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు ప్రీతు గుప్తా…భారత 64వ గ్రాండ్ మాస్టర్ గా రికార్డుల్లో చేరాడు. 2019 పోర్చుగీసు లీగ్ టోర్నీలో ఇంటర్నేషనల్ మాస్టర్ లెవ్ యాంక్లేవిచ్ ను ఓడించడం ద్వారా 2500 పాయింట్ల ఎలోరేటింగ్ సాధించడం ద్వారా గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకొన్నాడు.

విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితోనే తాను చదరంగ క్రీడలో ప్రవేశించి…గ్రాండ్ మాస్టర్ కావడం గర్వకారణంగా ఉందని ప్రీతు గుప్తా పొంగిపోతున్నాడు.

గుప్తా 15 రోజుల 4 నెలల 10 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

విశ్వనాథన్ ఆనంద్ భారత తొలి గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన 31 ఏళ్ల తర్వాత ప్రీతు గుప్తా 64వ గ్రాండ్ మాస్టర్ కావడం విశేషం.

భారత చదరంగ చరిత్రలో అత్యంత పిన్నవయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ఆటగాడి ఘనతను గుకేశన్ సొంతం చేసుకొన్నాడు.

తమిళనాడుకు చెందిన గుకేశన్ 2019 జనవరిలో…కేవలం 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా నిలిచి రికార్డు నెలకొల్పాడు.

First Published:  19 July 2019 11:44 PM GMT
Next Story