Telugu Global
NEWS

నేటినుంచే ప్రో-కబడ్డీ ఏడో సీజన్ హంగామా

హైదరాబాద్ అంచె పోటీలకు రంగం సిద్ధం గచ్చిబౌలీలో తొలిరోజునే డబుల్ ధమాకా దేశంలోని కబడ్డీ అభిమానులను గత ఆరు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి దశ…హైదరాబాద్ అంచె పోటీలకు రంగం సిద్ధమయ్యింది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా వచ్చే ఐదురోజుల్లో 11 మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. సీజన్ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో మాజీ చాంపియన్ యూ-ముంబాతో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఆరు సీజన్లుగా టైటాన్స్ కు సేవలు అందించిన స్టార్ […]

నేటినుంచే ప్రో-కబడ్డీ ఏడో సీజన్ హంగామా
X
  • హైదరాబాద్ అంచె పోటీలకు రంగం సిద్ధం
  • గచ్చిబౌలీలో తొలిరోజునే డబుల్ ధమాకా

దేశంలోని కబడ్డీ అభిమానులను గత ఆరు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ప్రో-కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తొలి దశ…హైదరాబాద్ అంచె పోటీలకు రంగం సిద్ధమయ్యింది.

గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా వచ్చే ఐదురోజుల్లో 11 మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు.

సీజన్ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో మాజీ చాంపియన్ యూ-ముంబాతో అమీతుమీ తేల్చుకోనుంది. గత ఆరు సీజన్లుగా టైటాన్స్ కు సేవలు అందించిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి తప్పుకోడంతో…..ఇరానీ డిఫండర్ అబోజర్ మిఘానీ నాయకత్వం వహిస్తున్నాడు.

గులాం రెజా చీఫ్ కోచ్ గా 7వ సీజన్ లీగ్ లో తెలుగు టైటాన్స్ తన సత్తా చాటుకోడానికి తహతహలాడుతోంది.

రాహుల్ చౌదరి స్థానంలో కోటీ 45 లక్షల రూపాయల వేలం ధరకు జట్టులో చేరిన స్టార్ రైడర్ సిద్ధార్ధ్ దేశాయ్ ప్రధాన అస్త్రంగా నిలువనున్నాడు.

బెంగళూరు బుల్స్ కు పట్నా పైరేట్స్ సవాల్..

డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్, మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగే రెండో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

పట్నా జట్టుకు ప్రదీప్ నర్వాల్ నాయకత్వం వహిస్తున్నాడు. కబడ్డీ లీగ్ లో 858 రైడింగ్ పాయింట్లు సాధించిన అసాధారణ రికార్డు ప్రదీప్ నర్వాల్ కు ఉంది.

మరోవైపు… మోహిత్ కుమార్, పవన్ షరావత్ బెంగళూరు బుల్స్ ప్రధాన రైడర్లుగా ఉన్నారు. డిఫెన్స్ లో మహేందర్ సింగ్ తురుపుముక్కగా ఉన్నాడు.

రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్ అంచె పోటీలు జరుగనున్నాయి.

ఇదీ హైదరాబాద్ అంచె పోటీల షెడ్యూలు…

  • జులై 21న జరిగే పోటీలలో బెంగళూరుతో గుజరాత్, తెలుగు టైటాన్స్ తో తమిళ్ తలైవాస్ పోటీపడతాయి.
  • జులై 22న యూ-ముంబాతో జైపూర్, పూణేరీ పల్టాన్ తో హర్యానా తలపడతాయి.
  • జులై 24న జరిగే మ్యాచ్ ల్లో బెంగాల్ తో యూపీ, తెలుగు టైటాన్స్ తో ఢిల్లీ ఢీ కొంటాయి.
  • జులై 25న జరిగే పోటీలో ఢిల్లీతో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది.
  • జులై 26న జరిగే డబుల్ ధమాకా షోలో…. యూపీతో గుజరాత్, తెలుగు టైటాన్స్ తో పట్నా పైరేట్స్ తలపడతాయి.

హైదరాబాద్ అంచె పోటీల కనీస టికెట్ ధర 350 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 3వేల 500 రూపాయలుగా నిర్ణయించారు.

First Published:  19 July 2019 11:34 PM GMT
Next Story