నటిగా సాయి పల్లవి నా పైనే ఉంటుంది – రష్మిక

‘ఛలో’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇప్పుడు అదే సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రష్మిక.

‘గీతా గోవిందం’ షూటింగ్ సమయంలోనే ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం రష్మికని ఎంపిక చేశారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొంత మంది హీరోయిన్లను ముందుగా అనుకున్నారు. సాయి పల్లవి పేరు కూడా అందులో ఉంది… కానీ సాయిపల్లవి వద్దకు వెళ్లే ముందే ఈ కథ కు రష్మీక వద్దకు వెళ్లిందట.

ఇక సాయి పల్లవి కి రష్మికా మందన్న నుంచి గట్టి పోటీ ఉంది అని ఇప్పటికే చాలా వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వార్తల పై రియాక్ట్ అయ్యింది రష్మిక మందన్న. ఒక నటిగా సాయి పల్లవి తన పైనే ఉంటుందని చెప్పింది రష్మిక. అంతేకాకుండా సాయి పల్లవి ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అని మరోవైపు తను ఇంకా ఆ మైలు రాయిని చేరుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది రష్మీక. ఈమె నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈ నెలాఖరులో విడుదల కానుంది.