జగన్‌ దంపతులకు డిప్లమేటిక్ పాస్‌పోర్టు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. డిప్లమేటిక్‌ పాస్‌పోర్టును అందుకున్నారు.

జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావడంతో విదేశాంగ శాఖ డిప్లమేటిక్ పాస్‌పోర్టును జారీ చేసింది. సాధారణ పాస్‌పోర్టు స్థానంలో జగన్ దంపతులు ఈ డిప్లమేటిక్ పాస్‌పోర్టును అందుకున్నారు.

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లమేటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత దాన్ని తిరిగి అప్పగించి…. సాధారణ పాస్‌పోర్టును చంద్రబాబు తీసుకున్నారు.