చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ధమ్కీ’

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాత గా తెరకెక్కిన చిత్రం ధమ్కీ.. రజిత్, త్రిషాలాషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వం వహించారు.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింది.

ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. రచయిత శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ సినిమా కి ఎస్.బి ఆనంద్ సంగీతం, దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సందర్భంగా ..

దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ… “ధమ్కీ చిత్రం వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం గా చేసుకుని తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ . ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా రూపొందింది.

ఈ చిత్రంలో బిత్తిరి సత్తి కామెడీ ప్రేక్షకులని ఆద్యంతం అలరిస్తుంది.. ఖర్చుకు వెనుకాడకుండా మా నిర్మాత ఈ సినిమాను ఎంతో ఫ్యాషన్ తో నిర్మించారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అన్నారు.

చిత్ర నిర్మాత సత్య నారాయణ సుంకర మాట్లాడుతూ… మా బ్యానేర్ లో యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ధమ్కీ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దర్శకుడు చెప్పిన కథ చాల బాగా నచ్చి సినిమా ని ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాను. నేను నమ్మిన విధంగా దర్శకుడు ఏనుగంటి యాక్షన్ కి పెద్ద పీట వేస్తూ చాలా బాగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ వర్క్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలోని పాటలు ఫైట్స్ అన్ని ఖర్చుకు వెనుకాడకుండా ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతి ఇచ్చే విధంగా తెరకెక్కించడం జరిగింది.

రామ్ లక్ష్మణ్ ఫైట్స్ తో పాటు శ్రీమణి సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ చిత్ర విజయం పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీ ని ప్రకటిస్తాం” అన్నారు.