Telugu Global
Cinema & Entertainment

పూరి నెక్ట్స్ ఏంటి? ఎవరితో?

మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ ను కమర్షియల్ హిట్ అనిపించారు మేకర్స్. రివ్యూల పరంగా ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తక్కువ రేటుకు అమ్మడంతో సినిమా సేఫ్ జోనర్ లోకి వెళ్తోంది. ఇవాళ్టి వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా ఓవరాల్ గా బ్రేక్-ఈవెన్ అవ్వబోతోంది. అతి తక్కువ రేట్లకు సినిమాను అమ్మడంతో మేటర్ సుఖాంతం అయింది. ఇదిలా ఉండగా…. ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ ఏం చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. రీసెంట్ గా […]

పూరి నెక్ట్స్ ఏంటి? ఎవరితో?
X

మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ ను కమర్షియల్ హిట్ అనిపించారు మేకర్స్. రివ్యూల పరంగా ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. తక్కువ రేటుకు అమ్మడంతో సినిమా సేఫ్ జోనర్ లోకి వెళ్తోంది. ఇవాళ్టి వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా ఓవరాల్ గా బ్రేక్-ఈవెన్ అవ్వబోతోంది. అతి తక్కువ రేట్లకు సినిమాను అమ్మడంతో మేటర్ సుఖాంతం అయింది. ఇదిలా ఉండగా…. ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ ఏం చేయబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్ట్స్ సినిమాకు సంబంధించి పూరి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 2 నెలలు రెస్ట్ మాత్రం తీసుకుంటానని, ఆ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఆలోచిస్తానని మాత్రం తెలిపాడు. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తీస్తానని కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్ కు డబుల్ ఇస్మాట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అంతా అనుకుంటున్నట్టు పూరి నెక్ట్స్ సినిమా ఈ సీక్వెల్ కాదు. ఇస్మార్ట్ శంకర్ కమర్షియల్ సక్సెస్ తో ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు ఇప్పుడు చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్లలో బాలకృష్ణ, గోపీచంద్, రవితేజ లాంటి హీరోలున్నారు. వీళ్లంతా ఇప్పటికే పూరితో టచ్ లోకి వెళ్లారు. సో.. సీక్వెల్ ను పక్కనపెట్టి వీళ్లలో ఒకరితో పూరి జగన్నాధ్ స్ట్రయిట్ మూవీ చేసే ఛాన్స్ ఉంది.

First Published:  21 July 2019 7:15 AM GMT
Next Story