మరో పేమెంట్ బ్యాంక్ మూసివేత

దేశంలో ఆర్బీఐ నిబంధనలు పాటిస్తూ… సరికొత్త డిజిటల్ పేమెంట్స్ ను ఆసరా చేసుకొని ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి. అంతకు ముందు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ అనే సంస్థలు ఉండేవి.

కాగా, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలు కూడా వెలువడ్డాయి. పలు బ్యాంకింగ్ రంగ సంస్థలతో పాటు టెలికాం కంపెనీలు కూడా పేమెంట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ సంస్థకు చెందిన పేమెంట్ బ్యాంకింగ్ విభాగం చేసిన స్కాం వల్ల పలు టెలికాం కంపెనీలపై నిఘా పెరిగింది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌పై నిషేధం కొనసాగుతోంది.

తాజాగా ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన ఐడియా పేమెంట్ బ్యాంకు సేవలను నిలిపివేశారు. అయితే 2015 అగస్టులో ఈ సర్వీసులకు లైసెన్సు వచ్చింది. కాని ఐడియా సంస్థ 2018 ఫిబ్రవరిలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించింది.

కాని ఆ సర్వీసు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయింది. ఇప్పటికే ఐడియా సంస్థ వోడాఫోన్‌తో విలీనం కావడంతో ఇరు యాజమాన్యాలు ఈ సర్వీసును నిలిపివేయాలని నిర్ణయించాయి.