రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గిన రవితేజ

కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ తరువాత రవితేజ హీరోగా నటించిన మూడు సినిమాలు ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’ మరియు ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి సినిమాలు డిజాస్టర్లుగా మారాయి.

వరుసగా మూడు ఫ్లాపులు ఒకేసారి రావడంతో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. అయితే మార్కెట్ తో సంబంధం లేకుండా రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

తాజాగా రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డిస్కో రాజా’ సినిమా విషయంలో కూడా రవితేజ ఏమాత్రం రెమ్యూనరేషన్ తగ్గించలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం రవితేజ తన తదుపరి సినిమా అయిన ‘మహాసముద్రం’ విషయంలో మాత్రం రవితేజ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో బాగా ఆలోచించిన రవితేజ ‘మహాసముద్రం సినిమాకి అసలు పారితోషకం తీసుకోవడం లేదట. అయితే దానికి బదులుగా సినిమా హిట్ అయితే వచ్చే ప్రాఫిట్ లలో కొంత భాగాన్ని రవితేజ తీసుకుంటాడట. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అంతే సంగతులు.

ఏదేమైనా రవితేజ చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలు తన కెరియర్ కి బాగా కీలకం కానున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో రవితేజ ఎంతవరకు హిట్లు అందుకుంటాడో చూడాలి.