రాహుల్ పై ప్రాంక్ ప్లే చేసిన నాగార్జున 

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి ‘మన్మధుడు 2’ అనే టైటిల్ తో సీక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా నాగార్జున దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పై చేసిన ఒక చిన్న ప్రాంక్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నెల కిషోర్ తో డబ్బింగ్ పనులతో బిజీగా ఉన్న రాహుల్ రవీంద్రన్ కి నాగార్జున ఫోన్ చేసి పోర్చుగీస్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తాము రోజు తిన్న ఫుడ్ ని రెస్టారెంట్ నుంచి తీసుకు రమ్మని చెబుతాడు.

నాగార్జున తో ఫోన్ మాట్లాడుతూ రెస్టారెంట్ కి వెళ్ళిన రాహుల్ రవీంద్రన్ ని… నాగార్జున ముందుగా రెస్టారెంట్ మధ్యలోకి వెళ్లి ‘మన్మధుడు 2’ సినిమా దర్శకుడిని నేనే అని చెప్పమని చెబుతాడు. కొంచెం బెరుకుగా అలాగే చెప్తాడు రాహుల్.

అంతేకాకుండా అక్కడున్న కస్టమర్ దగ్గర్నుంచి డ్రింక్ ని లాక్కుని తాగమని, వెయిటర్ తో కూల్ డ్రింక్ అస్సలు బాగాలేదని చెప్పమని, ఇలాంటి పనులు రాహుల్ రవీంద్రన్ తో చేయించిన నాగ్… ఆఖరికి ఒక అందమైన అమ్మాయి వద్దకు వెళ్లి మన్మధుడు సీజర్ ట్రైలర్ లోని “ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్..” డైలాగ్స్ కూడా చెప్పించాడు.

ఇలా వీడియో మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది. ప్లాన్ చేసిన ప్రాంక్ అయినప్పటికీ ఈ వీడియో ప్రమోషన్స్ కి బాగానే ఉపయోగపడుతోంది.