Telugu Global
Cinema & Entertainment

గ్యాంగ్ లీడర్ వాయిదా

సాహో సినిమా ఆగస్ట్ 30కి వాయిదాపడ్డంతో ఆ తేదీకి ప్రకటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కచ్చితంగా వాయిదా పడుతుందని అంతా ఊహించారు. మరికొందరు మాత్రం సాహోతో పోటీకి నాని సై అంటాడంటూ ప్రచారం సాగింది. కానీ ఇది ఇద్దరు హీరోల మధ్య పోటీ ఎంతమాత్రం కాదు. ఇద్దరు బడా నిర్మాతల బిజినెస్ సమస్య. అందుకే నిర్మాతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరి సమస్యలు మరొకరు తెలుసుకున్నారు. హీరోల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సినిమా రిలీజ్ డేట్స్ సెట్ చేసుకున్నారు. అలా […]

గ్యాంగ్ లీడర్ వాయిదా
X

సాహో సినిమా ఆగస్ట్ 30కి వాయిదాపడ్డంతో ఆ తేదీకి ప్రకటించిన గ్యాంగ్ లీడర్ సినిమా కచ్చితంగా వాయిదా పడుతుందని అంతా ఊహించారు. మరికొందరు మాత్రం సాహోతో పోటీకి నాని సై అంటాడంటూ ప్రచారం సాగింది. కానీ ఇది ఇద్దరు హీరోల మధ్య పోటీ ఎంతమాత్రం కాదు. ఇద్దరు బడా నిర్మాతల బిజినెస్ సమస్య. అందుకే నిర్మాతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరి సమస్యలు మరొకరు తెలుసుకున్నారు. హీరోల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సినిమా రిలీజ్ డేట్స్ సెట్ చేసుకున్నారు. అలా గ్యాంగ్ లీడర్ సినిమా అధికారికంగా వాయిదాపడింది.

యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, గ్యాంగ్ లీడర్ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తో స్వయంగా మాట్లాడారు. తమ సమస్య చెప్పి అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. ఈ రెండు బ్యానర్లకు సంబంధించిన నిర్మాతల మధ్య మంచి స్నేహబంధం కూడా ఉండడం, స్వయంగా అల్లు అరవింద్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరపడంతో గ్యాంగ్ లీడర్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్.

అయితే గ్యాంగ్ లీడర్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.. కొత్త విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ఎందుకంటే ఆగస్ట్ 30 తర్వాత చాలా రష్ కనిపిస్తోంది. వాల్మీకి, సైరా లాంటి పెద్ద సినిమాలున్నాయి. అందుకే ఆ నిర్మాతలతో కూడా చర్చించి అప్పుడు గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

First Published:  21 July 2019 5:00 AM GMT
Next Story