‘కన్నుకొట్టి’ పాట విడుదలైంది

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ తో చేతులు కలిపి ‘రణరంగం’ అనే యాక్షన్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

1980ల బాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా సినిమాకి సంబంధించిన రెండవ పాట ‘కన్నుకొట్టి చూసెనంట సుందరి’ లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఈ పాట వింటుంటేనే సంగీత దర్శకుడు కార్తిక్ రోడ్రిగీజ్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ని అందించారని చెప్పుకోవచ్చు. అతని గొంతు కూడా పాటకి మరింత ఎనర్జీ ని తెచ్చిపెట్టింది. కృష్ణ చైతన్య లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇంతకుముందు విడుదలైన ‘కల్యాణ వైభోగమే’ లిరికల్ వీడియో లాగా ఈ పాట లిరికల్ వీడియో కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది. సూర్యదేవర నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కాబోతోంది.