Telugu Global
NEWS

వరల్డ్ బ్యాంకు తీర్మానంపై తగ్గిన టీడీపీ

వైసీపీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయినా…. ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ పలు అంశాల్లో బొక్కబోర్లా పడుతోంది. కాపు రిజర్వేషన్లు, సున్నా వడ్డీ వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా బోల్తా కొట్టిన టీడీపీ… ఇటీవల ఏపీ రాజధాని నిర్మాణానికి రుణం తాము ఇవ్వడం లేదని ప్రకటించగానే మరోసారి ప్రతిపక్షం రెక్కలు విప్పింది. వరల్డ్ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గడానికి కారణం జగన్ విధానాలే కారణం అని… జగన్ ముఖం వరల్డ్ బ్యాంకుకు నచ్చలేదంటూ నారా లోకేష్‌ […]

వరల్డ్ బ్యాంకు తీర్మానంపై తగ్గిన టీడీపీ
X

వైసీపీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయినా…. ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ పలు అంశాల్లో బొక్కబోర్లా పడుతోంది. కాపు రిజర్వేషన్లు, సున్నా వడ్డీ వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా బోల్తా కొట్టిన టీడీపీ… ఇటీవల ఏపీ రాజధాని నిర్మాణానికి రుణం తాము ఇవ్వడం లేదని ప్రకటించగానే మరోసారి ప్రతిపక్షం రెక్కలు విప్పింది.

వరల్డ్ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గడానికి కారణం జగన్ విధానాలే కారణం అని… జగన్ ముఖం వరల్డ్ బ్యాంకుకు నచ్చలేదంటూ నారా లోకేష్‌ నుంచి టీడీపీ కార్యకర్తల వరకు హడావిడి చేశారు.

కానీ తీరా ఈ అంశంపై స్పష్టత ఇచ్చిన ప్రపంచ బ్యాంకు… కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగానే తాము అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నామని ప్రకటించింది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని… ఏపీకి ఇతర ప్రాజెక్టుల్లో భారీగా ఆర్థిక అండ ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించింది. దీంతో నారా వారి టీం నాలుక కరుచుకుంది. ఈ అంశంపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చి సభను స్తంభింప చేయాలని తొలుత టీడీపీ భావించింది.

సోమవారం అసెంబ్లీలో వరల్డ్ బ్యాంకు అంశంతో ప్రభుత్వాన్ని షేక్ చేయాలనుకుంది. ఇంతలో ప్రపంచ బ్యాంకే వివరణ ఇవ్వడంతో వాయిదా తీర్మానం ఆలోచనకు మంగళం పాడేసింది.

First Published:  21 July 2019 9:38 PM GMT
Next Story