Telugu Global
Cinema & Entertainment

'జిగర్తాండ' రీమేక్ లో తమన్నా లేదా?

తమిళంలో గ్యాంగ్ స్టర్ కామెడీగా విడుదలై… బ్లాక్ బస్టర్ అయిన ‘జిగర్తాండ’ సినిమా తెలుగులో ‘వాల్మీకి’ అనే టైటిల్ తో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని హిందీలో కూడా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్నాడు. ‘ఉడ్తా పంజాబ్’ ఫేమ్ అభిషేక్ చౌబే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గత కొంతకాలంగా సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. మొన్నటిదాకా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా […]

జిగర్తాండ రీమేక్ లో తమన్నా లేదా?
X

తమిళంలో గ్యాంగ్ స్టర్ కామెడీగా విడుదలై… బ్లాక్ బస్టర్ అయిన ‘జిగర్తాండ’ సినిమా తెలుగులో ‘వాల్మీకి’ అనే టైటిల్ తో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే సినిమాని హిందీలో కూడా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాడ్వాలా నిర్మిస్తున్నాడు. ‘ఉడ్తా పంజాబ్’ ఫేమ్ అభిషేక్ చౌబే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

గత కొంతకాలంగా సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. మొన్నటిదాకా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని పుకార్లు వినిపించాయి.

అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కానీ తమిళంలో లక్ష్మీమీనన్ నటి పోషించిన పాత్రను హిందీలో తమన్నా ని సంప్రదించినట్లు సమాచారం. అజయ్ దేవగన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో సంజయ్ దత్ బాబీ సింహ పోషిస్తారట.

తమిళంలో సిద్ధార్థ నటించిన పాత్రలో ఇప్పుడు హిందీలో ఫర్హాన్ అక్తర్ కనిపించబోతున్నారట. అయితే ఇంతకు ముందు అనుకున్న కాస్ట్ ని మార్చి ఇప్పుడు దర్శక నిర్మాతలు ఫర్హాన్ అక్తర్ స్థానం లో యువ హీరో కార్తీక్ ని తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తమన్నా ఈ సినిమాలో నటించక పోవచ్చు అని కొందరి అంచనా.

First Published:  21 July 2019 10:40 PM GMT
Next Story