మైత్రి నుంచి తప్పుకున్న నిర్మాత ?

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ లను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థను నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి లు కలిసి స్థాపించారు.

‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ లను టాలీవుడ్ కి అందించిన వీరు ఇప్పుడు విడిపోబోతున్నారని సమాచారం అందుతోంది. ముగ్గురు నిర్మాతలలో ఒకరైన మోహన్ చెరుకూరి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

మోహన్ స్వయంగా ఇప్పుడు ఒక కొత్త నిర్మాణ సంస్థను స్థాపిస్తారని, ఇక నుండి మైత్రి బ్యానర్ పై సినిమాలు చేయరని వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లో ఇప్పుడు నవీన్ యెర్నేని, రవిశంకర్ ai మాత్రమే మిగిలారు. మై’త్రి’ కాస్తా ఇప్పుడు మై’టూ’ గా మారింది.

అయితే ఈ మధ్యనే ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి డిజాస్టర్ ల ను అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బడా సినిమాలు ఉన్నాయి.