Telugu Global
National

ప్రియాంకే దిక్కు... లేదంటే చీలిక తప్పదు

కాంగ్రెస్‌లో ఏర్పడిన నాయకత్వం సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అధ్యక్ష పదవి స్వీకరించేందుకు రాహుల్ ససేమిరా అంటుండడంతో కాంగ్రెస్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత నట్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ఇటీవల యూపీలోని సోన్‌భద్రా కాల్పుల ఘటన బాధితులను పరామర్శించే సమయంలో ప్రియాంక చూపిన తెగువను ఆయన ప్రశంసించారు. తాను అనుకున్నది సాధించేందుకు ప్రియాంక గాంధీ అద్భుతంగా వ్యవహరించారని నట్వర్ వ్యాఖ్యానించారు. […]

ప్రియాంకే దిక్కు... లేదంటే చీలిక తప్పదు
X

కాంగ్రెస్‌లో ఏర్పడిన నాయకత్వం సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. అధ్యక్ష పదవి స్వీకరించేందుకు రాహుల్ ససేమిరా అంటుండడంతో కాంగ్రెస్‌లో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత నట్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.

ఇటీవల యూపీలోని సోన్‌భద్రా కాల్పుల ఘటన బాధితులను పరామర్శించే సమయంలో ప్రియాంక చూపిన తెగువను ఆయన ప్రశంసించారు. తాను అనుకున్నది సాధించేందుకు ప్రియాంక గాంధీ అద్భుతంగా వ్యవహరించారని నట్వర్ వ్యాఖ్యానించారు.

పార్టీ అధ్యక్ష పదవిని తానే కాకుండా గాంధీ కుటుంబం నుంచి మరెవరూ కూడా స్వీకరించబోరని రాహుల్ చేసిన ప్రకటనపైనా నట్వర్ స్పందించారు. రాహుల్ గాంధీ తన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. గాంధీ కుటుంబం సభ్యులే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి స్వీకరించాలని కోరారు. అలా కాకుండా మరొకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే కాంగ్రెస్‌ పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందని నట్వర్ జోస్యం చెప్పారు.

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి కూడా ప్రియాంక పార్టీ పగ్గాలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియాంక మాత్రమే పార్టీని నిలబెట్టగలరని అభిప్రాయపడ్డారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్ కూడా… ప్రియాంక గాంధీ పార్టీని నడిపేందుకు ముందుకు రావాలని కోరారు. లక్షల మంది కార్యకర్తల గురించి ఆమె ఆలోచించాలని కోరారు.

First Published:  22 July 2019 4:00 AM GMT
Next Story