Telugu Global
Cinema & Entertainment

మీ టూ ఉద్యమం పెద్దగా ఉపయోగపడలేదు.... కారణం అదే....

జెర్సీ సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెట్టిన కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మీ టూ మూమెంట్ సందర్భం గా యాక్టిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆవిడ ఇటీవలే  మీ టూ గురించి మాట్లాడుతూ…. ఈ మూమెంట్ పెద్దగా ఏమి మార్పులు తీసుకురాలేకపోయింది అని తేల్చేశారు. “ఒక్క సినిమా ఇండస్ట్రీ లో ఒక్కసారిగా విప్లవం అయితే తీసుకొని రాలేదు. అందరూ మగవాళ్ళని మార్చలేదు. మీ టూ లాంటి మూమెంట్ కూడా […]

మీ టూ ఉద్యమం పెద్దగా ఉపయోగపడలేదు.... కారణం అదే....
X

జెర్సీ సినిమా తో తెలుగు పరిశ్రమ లో కి అడుగు పెట్టిన కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ మీ టూ మూమెంట్ సందర్భం గా యాక్టిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆవిడ ఇటీవలే మీ టూ గురించి మాట్లాడుతూ…. ఈ మూమెంట్ పెద్దగా ఏమి మార్పులు తీసుకురాలేకపోయింది అని తేల్చేశారు.

“ఒక్క సినిమా ఇండస్ట్రీ లో ఒక్కసారిగా విప్లవం అయితే తీసుకొని రాలేదు. అందరూ మగవాళ్ళని మార్చలేదు. మీ టూ లాంటి మూమెంట్ కూడా పెద్దగా మార్పులని ఏమి తీసుకొని రాలేదు. ఎంతో మంది తమ గళం విప్పినా కానీ ఆరోపణలు ఎదుర్కొన్న మగవాళ్ళు అనేక మంది అసలు తప్పే చేయలేదు అనే విధం గా బయటకి వచ్చారు. వాతావరణ మార్పు గురించి ప్రతి రోజూ ఎలా మాట్లాడుకుంటామో అలా ఈ మూమెంట్ గురించి ప్రతి రోజు చర్చ జరగాలి. మహిళా భద్రత, లైంగిక వేధింపులు, లాంటి వాటి గురించి తరచూ మాట్లాడుతూ ఉంటె అప్పుడే ఏమైనా మార్పులని ఆశించచ్చు” అని శ్రద్ధ శ్రీనాథ్ తెలిపింది.

శ్రద్ధ స్నేహితురాలు శృతి హరిహరన్… మీ టూ మూమెంట్ లో హీరో అర్జున్ కి వ్యతిరేకం గా వెళ్ళిన విషయం లో శ్రద్ధ ఆమెకు సపోర్ట్ చేయడం తో కన్నడ లో ఎక్కువ ఆఫర్స్ రావడం లేదు అనే టాక్ నడుస్తుంది.

First Published:  21 July 2019 8:01 PM GMT
Next Story