Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (22-07-2019)

సరిలేరు నీకెవ్వరు మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ ను ఈనెల 26 నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణలో రైల్వే స్టేషన్ సెట్ వేస్తున్నారు. మరోవైపు రామోజీ ఫిలింసిటీలో మరో స్పెషల్ సెట్ రెడీ అవుతోంది. కర్నుల్ లో ఉన్న కొండారెడ్డిబురుజు సెట్ ను ఫిలింసిటీలో వేస్తున్నారు. ఈ సెట్ కోసం అక్షరాలా 4 […]

స్టుడియో రౌండప్ (22-07-2019)
X

సరిలేరు నీకెవ్వరు

మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్ లో పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ ను ఈనెల 26 నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభిస్తారు. ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణలో రైల్వే స్టేషన్ సెట్ వేస్తున్నారు. మరోవైపు రామోజీ ఫిలింసిటీలో మరో స్పెషల్ సెట్ రెడీ అవుతోంది. కర్నుల్ లో ఉన్న కొండారెడ్డిబురుజు సెట్ ను ఫిలింసిటీలో వేస్తున్నారు. ఈ సెట్ కోసం అక్షరాలా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఆర్-ఆర్-ఆర్

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్-ఆర్-ఆర్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కోకాపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ మూవీ కోసం కోకాపేటలో 1800 సంవత్సరాన్ని తలపించే వాతావరణంతో సెట్ వేశారు. ఆ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. వచ్చే ఏడాది జులై 30న ఆర్-ఆర్-ఆర్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

వెంకీ మామ

గ్యాప్ లేకుండా నడుస్తోంది వెంకీ మామ షూటింగ్. ఎందుకంటే ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, తర్వాత సినిమాలకు వెళ్లాలి నాగచైతన్య, వెంకీ. వీళ్ల కోసం కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక వెంకీ మామ విషయానికొస్తే, మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ సారధి స్టుడియోస్ లో జరిగింది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ వారమంతా నాన్-స్టాప్ షెడ్యూల్ ఉంటుంది.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఓ కో-డైరక్టర్ తో జరిగిన వివాదం కారణంగా ఈ సినిమా షూటింగ్ కు 3 రోజులు హాజరుకాలేదు బన్నీ. తాజాగా అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభమైన షెడ్యూల్ కు మాత్రం హాజరయ్యాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

డిస్కోరాజా

రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ఏకంగా కోటి 20 లక్షల రూపాయల ఖరీదైన సెట్ వేశారు. సినిమాకు ఈ సెట్ కీలకం అంటోంది యూనిట్. ఈ షెడ్యూల్ లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనిహొప్ లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్ ని డైర‌క్ట్ గా దియెట‌ర్ లో చూస్తే ప్రేక్ష‌కులు ఫీలింగ్ కొత్త గా వుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆలోచ‌న. ఆగస్ట్ మొదటి వారం నుంచి ఢిల్లీలో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు.

వాల్మీకి

వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఓ సాంగ్ తీస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చాన్నాళ్ల తర్వాత హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది.

First Published:  22 July 2019 12:19 PM GMT
Next Story