Telugu Global
NEWS

పాములకు పాలుపోయడంపై తెలంగాణలో వివాదం

పాములకు పాలు పోయడంపై తెలంగాణ అటవీశాఖ తీవ్రంగా స్పందిస్తోంది. స్వచ్చంధ సంస్థలు, అటవీ అధికారులతో జరిగిన సమావేశంలో పాములకు పాలు పోయడాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయన్నది మూడనమ్మకమని… ఇలా పాలు పోయడం వల్ల పాములు చచ్చిపోతున్నాయని ఇటీవల పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పాముల సంఖ్య తగ్గిపోవడం వల్ల జీవావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్వచ్చంధ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో అటవీ శాఖ అధికారులు పలు […]

పాములకు పాలుపోయడంపై తెలంగాణలో వివాదం
X

పాములకు పాలు పోయడంపై తెలంగాణ అటవీశాఖ తీవ్రంగా స్పందిస్తోంది. స్వచ్చంధ సంస్థలు, అటవీ అధికారులతో జరిగిన సమావేశంలో పాములకు పాలు పోయడాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు.

పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయన్నది మూడనమ్మకమని… ఇలా పాలు పోయడం వల్ల పాములు చచ్చిపోతున్నాయని ఇటీవల పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పాముల సంఖ్య తగ్గిపోవడం వల్ల జీవావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్వచ్చంధ సంస్థలతో నిర్వహించిన సమావేశంలో అటవీ శాఖ అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

పుట్టల్లో పాలు పోసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నాగుల పంచమి సందర్భంగా ఎవరైనా పాములను పట్టుకుని వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈనెల 29 నుంచి పాములకు పాలు పోయడం వల్ల కలిగే చెడు ప్రభావాలపై స్కూళ్లు, పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి బీజేపీ నేతలు వెంటనే మతం కోణంలో స్పందించారు. కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు పాములకు పాలు పోయకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి కొల్లు మాధవి ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తాము ప్రతిఘటిస్తామన్నారు.

First Published:  22 July 2019 11:17 AM GMT
Next Story