బిగ్ బాస్ – 3 లో కాంటెస్టెంట్ గా శ్రద్ధ

బోలెడు వివాదాల మధ్య ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా మొదలైన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో 15 మంది కంటెస్టెంట్స్ 100 రోజులపాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నారు.

ప్రస్తుతానికి రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3…. త్వరలోనే కొత్త మలుపు తిరగబోతోందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 3 లోకి త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీముఖి, పునర్నవి భూపాలం, అషు వంటి కంటెస్టెంట్ ఉన్నప్పటికీ గ్లామర్ కంటెంట్ మరింత పెంచడం కోసం బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సారి మరొక హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారట.

ఆమె ఎవరో కాదు శ్రద్ధాదాస్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి పాపులర్ అయిన శ్రద్ధ ఇప్పుడు బుల్లి తెర పై మెరవనుంది. హౌస్ మేట్స్ లో ఒకరు ఎలిమినేట్ అయిపోయిన తరువాత శ్రద్ధా దాస్ బిగ్ బాస్ హౌస్ లోకి తన ఎంట్రీ ఇవ్వనుందట.

నిజానికి బిగ్ బాస్ నిర్వాహకులు హాట్ డ్యూటీ హెబ్బా పటేల్ ని బిగ్ బాస్ లోకి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హెబ్బా పటేల్ బిగ్ బాస్ కి నో చెప్పిందట. కాబట్టి ఆమె స్థానంలో శ్రద్ధాదాస్ ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.