సెల్‌ఫోన్‌, ఐటీ ఒకటి కాదు బాబు – బుగ్గన సెటైర్లు

శాసనమండలిలో సెల్‌ఫోన్‌పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌… దేశంలో 10 సెల్‌ఫోన్‌లు తయారవుతుంటే ఏపీలో రెండు తయారవుతున్నాయని… టీడీపీ హయాంలో ఐటీ అభివృద్ధికి ఇదే నిదర్శనమని చెప్పుకున్నారు.

దీంతో స్పందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి… బాబు రాజేంద్రప్రసాద్‌కు చరకలంటించారు. తాను పాఠశాలలో చదువుతున్న సమయంలో టీచర్‌ పెంపుడు జంతువుపై వ్యాసం రాయాల్సిందిగా చెప్పారని…. అందుకు ఒక విద్యార్థి ఆవు గురించి రెండు పేజీల వ్యాసం రాశాడని బుగ్గన వివరించారు.

దాన్ని చూసిన టీచర్‌ రెండు పేజీల్లోని వ్యాసాన్ని కొట్టేసి కష్టపడి రాసిందుకు మాత్రం రెండు మార్కులు వేసి… ఆవు పెంపుడు జంతువు కాదు అని వివరించిందని బుగ్గన గుర్తు చేశారు.

అలాగే బాబు రాజేంద్రప్రసాద్‌ కూడా సెల్‌ఫోన్‌ అంటే ఐటీ అనుకుంటున్నారని… కానీ ఐటీ అంటే సెల్‌ఫోన్‌ కాదు అన్న విషయం గుర్తించుకోవాలన్నారు. దీంతో సభలో అందరూ నవ్వారు. దాంతో బాబు రాజేంద్రప్రసాద్ ముఖం మరింత నల్లబడిపోయింది.