పూరి, ఛార్మి బంగారం అని చెప్తున్న రామ్

ఇస్మార్ట్ శంకర్ సినిమా పెద్ద విజయం సాధించడం, ఆ సినిమా అప్పుడే లాభాల బాట పట్టడం తో పూరి జగన్నాథ్ ఇక విజయ పథం లో నడుస్తాడని, తను చేసిన అప్పులు అన్నీ తీర్చేయబోతున్నాడు అనే టాక్ నడుస్తున్న నేపథ్యం లో కొన్ని సెక్షన్ల మీడియా లో మాత్రం పూరి తన సినిమా కి పని చేసిన వాళ్ళ అందరికీ పూర్తిగా ఇంకా పారితోషికం ఇవ్వలేదు అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.

ఐదు కోట్ల పారితోషికానికి ఒప్పుకున్న రామ్ కి కేవలం అందులో సగం మాత్రమే చెల్లించారని, ఈ విషయమై తను ఆగ్రహం తో ఉంటూ, సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనకుండా విదేశాలకి చెక్కేసాడు అని టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయం రామ్ వరకు చేరింది. అందుకని రామ్ వెంటనే ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

పూరి పారితోషికం ఎగ్గొట్టాడు అనే విషయం పై స్పందిస్తూ రామ్ నవ్వాడు. పూరి, ఛార్మి పారితోషికం ఇచ్చే విషయం లో బంగారం అని కొనియాడాడు. “సాధారణం గా తప్పుడు వార్తల పై నేను స్పందించను…. కానీ ఈ విషయం లో మాత్రం వాళ్ళు బంగారం.” అన్నాడు రామ్.