భారత్ తో టీ-20 సమరానికి పోలార్డ్, సునీల్ నరైన్

  • అమెరికా వేదికగా మొదటి రెండు టీ-20 మ్యాచ్ లు 
  • రెండేళ్ల తర్వాత విండీస్ జట్టులో సునీల్ నరైన్

భారత్ తో ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ కు…వెస్టిండీస్ క్రికెట్ బోర్డు…పవర్ ఫుల్ టీమ్ ను సిద్ధం చేసింది.

జెయింట్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని 14 మంది సభ్యుల జట్టులో మెరుపు ఆల్ రౌండర్లు కిరాన్ పోలార్డ్,
యాండ్రీ రస్సెల్, జాదూ స్పిన్నర్ సునీల్ నరైన్ లకు చోటు కల్పించారు.

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తురుపుముక్కగా ఉన్న మ్యాజిక్ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండేళ్ల విరామం తర్వాత విండీస్ జట్టు తరపున ఆడటానికి సిద్ధం కావటం విశేషం.

ఫ్లారిడాలో డబుల్ థమాకా….

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండు టీ-20 మ్యాచ్ లను ఫ్లారిడాలోని లాడెర్ హిల్ కు చెందిన బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం
వేదికగా నిర్వహిస్తారు. ఈ రెండుమ్యాచ్ లూ ఆగస్టు 3, 4 తేదీలలో జరుగుతాయి.

సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ ను గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఆగస్టు 6న నిర్వహిస్తారు.

సిరీస్ కు క్రిస్ గేల్ దూరం….

సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ లేకుండానే టీ-20 సిరీస్ కు కరీబియన్ టీమ్ సిద్ధమయ్యింది. బ్రాత్ వెయిట్ నాయకత్వంలోని విండీస్ జట్టు సభ్యుల్లో సునీల్ నరైన్, కీమో పాల్, కీరాన్ పోలార్డ్, యాండ్రీ రసెల్, ఖరే పియరీ, నికోలస్ పూరన్, రోమో పావెల్, ఆంథోనీ బ్రాంబెల్, ఒషియన్ థామస్, జాన్ కాంప్ బెల్, షెల్డన్ కోట్రెల్, ఇవిన్ లూయిస్, హెట్ మేయర్ ఉన్నారు.

రెండుజట్లు సమానబలం కలిగి ఉండడంతో సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.