ఇస్మార్ట్ శంకర్ 5 రోజుల వసూళ్లు

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. ఆదివారం నుంచే ఈ సినిమాకు చాలా ఏరియాల్లో లాభాలు రావడం ప్రారంభమయ్యాయి. సోమవారం వచ్చినా ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదు. అలా విడుదలైన 5 రోజుల్లో ఈ సినిమా అక్షరాలా 23 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ సాధించింది.

ఇక్కడ ఓ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ నేను శైలజ. ఆ సినిమా లైఫ్ టైమ్ లో సాధించిన వసూళ్లను ఇస్మార్ట్ శంకర్ సినిమా కేవలం 5 రోజుల్లో అధిగమించింది. అంతేకాదు, ఈ సినిమాతో నైజాంలో 10 కోట్లు షేర్ సాధించిన ఘనత కూడా అందుకున్నాడు రామ్. నైజాంలో ఇలా 10 కోట్ల క్లబ్ లోకి ఎంటరవ్వడం రామ్ కు ఇదే ఫస్ట్ టైమ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన 5 రోజుల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 10.54 కోట్లు
సీడెడ్ – రూ. 4.07 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.77 కోట్లు
ఈస్ట్ – రూ. 1.46 కోట్లు
వెస్ట్ – రూ. 1.17 కోట్లు
గుంటూరు – రూ. 1.47 కోట్లు
నెల్లూరు – రూ. 0.80 కోట్లు
కృష్ణా – రూ. 1.45 కోట్లు