Telugu Global
National

తదుపరి లక్ష్యం సూర్యుడే...

అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2 విజయవంతం అవడంతో అదే ఉత్సాహంతో తదుపరి సూర్యుడిపై దృష్టి పెడుతోంది. సూర్యుడి చుట్టూ ఉన్న కాంతి వలయాన్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందు కోసం వచ్చే ఏడాది మొదట్లో ఆదిత్య ఎల్‌-1 పేరుతో సోలార్‌ మిషన్‌కు సిద్ధమైంది. సూర్యుడి చుట్టూ ఆవరించిన వలయం వేల కిలోమీటర్ల మేర ఆవరించి ఉంటుంది… దీన్ని లోతుగా పరిశీలన చేయాలన్న ఉద్దేశంతోనే ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను […]

తదుపరి లక్ష్యం సూర్యుడే...
X

అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. చంద్రయాన్-2 విజయవంతం అవడంతో అదే ఉత్సాహంతో తదుపరి సూర్యుడిపై దృష్టి పెడుతోంది.

సూర్యుడి చుట్టూ ఉన్న కాంతి వలయాన్ని అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందు కోసం వచ్చే ఏడాది మొదట్లో ఆదిత్య ఎల్‌-1 పేరుతో సోలార్‌ మిషన్‌కు సిద్ధమైంది.

సూర్యుడి చుట్టూ ఆవరించిన వలయం వేల కిలోమీటర్ల మేర ఆవరించి ఉంటుంది… దీన్ని లోతుగా పరిశీలన చేయాలన్న ఉద్దేశంతోనే ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను చేపడుతున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఇప్పటికీ సౌర కాంతి వలయానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం లేదని… ఆ రహస్యాలను ఆదిత్య ఎల్‌-1 ద్వారా చేధిస్తామంటోంది ఇస్రో.

భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఈ సూర్య కాంతి వలయం ఉంది. ఈ వలయాన్ని కొద్దిమేర అధ్యయనం చేసినా దాని సూర్య కాంతికి సంబంధించిన అనేక అంశాలను తెలుసుకోవచ్చని ఇస్రో చెబుతోంది.

First Published:  22 July 2019 9:04 PM GMT
Next Story