Telugu Global
NEWS

జగన్ తన పాలనలో సెంచరీలు కొట్టాలి : గవర్నర్

పాలనలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెంచరీలు కొట్టాలని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నరసింహన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలుకు తాను ఎంతో ఆనంద పడుతున్నానని చెప్పిన గవర్నర్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రసంశల జల్లు కురిపించారు. గవర్నర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, మంత్రులు, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. […]

జగన్ తన పాలనలో సెంచరీలు కొట్టాలి : గవర్నర్
X

పాలనలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సెంచరీలు కొట్టాలని ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ అన్నారు. గవర్నర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నరసింహన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు పలికింది.

ఈ వీడ్కోలుకు తాను ఎంతో ఆనంద పడుతున్నానని చెప్పిన గవర్నర్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రసంశల జల్లు కురిపించారు. గవర్నర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, మంత్రులు, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను క్రికెట్ మ్యాచ్ తో పోలుస్తూ మాట్లాడారు. “జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతీ బంతిని సిక్సర్, ఫోర్ కొడుతున్నంత ఆనందంగా ఉంది” అని గవర్నర్ అన్నారు.

జగన్మోహన్ రెడ్డికి గడచిన పది సంవత్సరాలు ప్రాక్టీస్ మ్యాచ్ వంటిదని, ఇప్పుడు తన పాలన ద్వారా ఆయన అసలు మ్యాచ్ ని చూపిస్తున్నారని అన్నారు.

“జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాలనే అందిస్తే పాలనలో సెండరీ కొట్టడం ఖాయం” అని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందని, ఇంతటి చక్కటి వాతావరణంలో శాసనసభ కార్యక్రమాలు జరగడం తాను గతంలో చూడలేదని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని, అది త్వరలోనే నెరవేరుతుందని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.

నరసింహాన్ నన్ను వేలు పట్టుకుని నడిపించారు – సీఎం జగన్

ఉమ్మడి రాష్ట్ర్రాల గవర్నర్ నరసింహాన్ తనను ఓ తండ్రిలా, ఓ పెద్దాయనలా వేలు పట్టుకుని నడిపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు.

గడచిన పది సంవత్సరాలుగా గవర్నర్ నరసింహన్ తనను సొంత కొడుకులా చూసుకున్నారని, అందుకు తాను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.

గవర్నర్ నరసింహన్ అధికారికంగా తమను వదిలి వెళ్లిపోతున్నా…. ఆయన నిరంతరం మన మధ్య ఉన్నట్లుగానే ఉంటుందని అన్నారు.

“గవర్నర్ నరసింహన్ అధికారికంగా మన మధ్యన లేరనే బాధ లోలోపల చాలా ఉంది. ఆయినా ఆంధ్రప్రదేశ్ ఆయనకు ఎప్పుడూ సొంత రాష్ట్ర్రమే” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణితో పాటు రాష్ట్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ.సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సావంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

First Published:  22 July 2019 8:49 PM GMT
Next Story