రామోజీ ఫిలిం సిటీలో కర్నూల్ ఫోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి అయింది. తదుపరి షెడ్యూల్ నెలాఖరులో హైదరాబాద్ లో మొదలవుతుంది. అయితే సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఒక స్పెషల్ సెట్ ను ఏర్పాటు చేయనుంది చిత్రబృందం. రామోజీ ఫిలిం సిటీ లో ‘సరిలేరు నీకెవ్వరు’ టీం కర్నూల్ స్మారక చిహ్నం కొండారెడ్డి బురుజు ని నిర్మించనుంది.

ఈ సెట్ ని వేయడం కోసం చిత్రబృందం ఏకంగా 4 కోట్లు ఖర్చు పెట్టనుందట. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఇక్కడ జరగనుంది. ఆ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయని… ప్రేక్షకులకు ఆ సన్నివేశాలు నచ్చుతాయని చిత్ర బృందం విశ్వసిస్తోంది.

ముందుగా మహేష్ బాబు మరియు సినిమా హీరోయిన్ రష్మిక మందన్న ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత స్పెషల్ గా వేసిన ఈ సెట్లో చిత్రీకరణ జరగబోతోందట. అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.