ఈ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయిన పూరి

పూరి జగన్నాథ్ కి ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తో విజయం దక్కింది… ఎప్పుడెప్పుడు పూరి సక్సెస్ దారి లోకి వస్తాడు అని ఎదురు చూసిన చాలా మంది అభిమానులకు, సినిమా ప్రేక్షకులకి, ఈ సినిమా విజయం మంచి ఊరట ఇచ్చింది.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగం గా మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా చేస్తాను అని చెప్పినా, ఈ సారి సినిమా చేసేందుకు తాను ఒప్పుకోక పోవచ్చు అనే అభిప్రాయాన్ని తెలియజేసిన పూరి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. మహేష్ హిట్స్ ఉన్న దర్శకులతోనే సినిమా చేస్తాడు అని చెప్పి… అందరి ఆగ్రహానికి గురయ్యాడు.

అయితే ఇప్పుడు తాజా గా ఎన్టీఆర్ గురించి కూడా కామెంట్స్ చేసి తారక్ అభిమానుల కోపానికి గురయ్యాడు పూరి. తారక్ గురించి చెప్తూ, తారక్ డ్రైవ్ చేస్తే స్పీడ్ కి లిమిట్ ఉండదు అని, ఇష్టం వచ్చినట్లు నడుపుతాడు అని, భయం వేస్తుంది అని చెప్పాడు. “అదేంటి మరి, సినిమాల్లో స్లో గా వెళ్ళమని చెప్తాడు” అని యాంకర్ అడగగా, “చెప్తే వినడు” అని పూరి చెప్పాడు.

ఇదంతా సరదాగా నే సాగినా పూరి చెప్పిన నిజం తారక్ అభిమానులకి మాత్రం చేదుగా అనిపించింది. అనవసరం గా తారక్ పరువు తీస్తున్నాడు అని వారు అభిప్రాయపడ్డారు.