17 రోజులు.. 17 కోట్లు

సమంత ప్రధాన పాత్ర లో వచ్చిన చిత్రం ఓ బేబీ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. సినిమా విడుదల అయిన తొలి రోజే హిట్ టాక్ అదుకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో దాదాపు గా 17 కోట్ల రూపాయలని రాబట్టింది. ఈ సినిమా విషయంలో సమంత దగ్గర ఉండి ప్రమోట్ చేయడం తో సినిమా కి మంచి బజ్ వచ్చింది. ఇక ఈ సినిమా అమెరికా లో కూడా మంచి గా నే వసూళ్ళని రాబట్టింది.

ఆంధ్ర ప్రదేశ్, మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికే 11 కోట్లకు పైగా సాధించింది. సినిమా పెద్ద హిట్ అయ్యి సమంత కెరీర్ కి, మార్కెట్ కి మంచి రోజులని తెచ్చి పెట్టింది అని చెప్పొచ్చు. నందిని రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో సమంత తో పాటు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, మరియు తదితరులు నటించారు.