Telugu Global
NEWS

రాజస్థాన్ క్రికెట్లో సరికొత్త చరిత్ర

భారతజట్టులో తొలిసారిగా ముగ్గురు రాజస్థానీ క్రికెటర్లు విండీస్ తో టీ-20 సిరీస్ కు చాహర్ బ్రదర్స్, ఖలీల్ అహ్మద్  ఆగస్టు 3 నుంచి కరీబియన్ టీమ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ భారత క్రికెట్ అంటే ముంబై, చెన్నై, బెంగళూరు , ఢిల్లీ, కోల్ కతా నగరాల క్రికెటర్లే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. ఐపీఎల్ పుణ్యమా అంటూ… క్రికెట్ వారసత్వం అంతంత మాత్రంగా ఉన్న రాజస్థాన్ లాంటి రాష్ట్ర్రాల క్రికెటర్లు సైతం భారతజట్టులో స్ధానం సంపాదించడానికి పోటీపడుతున్నారు. […]

రాజస్థాన్ క్రికెట్లో సరికొత్త చరిత్ర
X
  • భారతజట్టులో తొలిసారిగా ముగ్గురు రాజస్థానీ క్రికెటర్లు
  • విండీస్ తో టీ-20 సిరీస్ కు చాహర్ బ్రదర్స్, ఖలీల్ అహ్మద్
  • ఆగస్టు 3 నుంచి కరీబియన్ టీమ్ తో తీన్మార్ టీ-20 సిరీస్

భారత క్రికెట్ అంటే ముంబై, చెన్నై, బెంగళూరు , ఢిల్లీ, కోల్ కతా నగరాల క్రికెటర్లే అనుకొనే రోజులకు కాలం చెల్లింది. ఐపీఎల్ పుణ్యమా అంటూ… క్రికెట్ వారసత్వం అంతంత మాత్రంగా ఉన్న రాజస్థాన్ లాంటి రాష్ట్ర్రాల క్రికెటర్లు సైతం భారతజట్టులో స్ధానం సంపాదించడానికి పోటీపడుతున్నారు.

రాజస్థాన్ క్రికెట్ ఘనత…

ఎడారి రాష్ట్ర్రం రాజస్థాన్ అనగానే…పాతతరం టెస్ట్ క్రికెటర్లు సలీం దురానీ, పార్థసారథి శర్మ లాంటి అలనాటి ఆటగాళ్ల పేరే ముందుగా గుర్తుకు వస్తుంది.

ఆ తర్వాత ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా కెరటంలా దూసుకొచ్చి…వివాదాలతో విదేశాలకు పారిపోయిన లలిత్ మోడీ కళ్ల ముందు కదలాడుతాడు.

ఐపీఎల్ తొలిచాంపియన్ గా అవతరించిన జైపూర్ ఫ్రాంచైజీకి చెందిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ఎందరో యువఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు.

ఐపీఎల్ తో నయాజోష్…

వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్ క్రికెట్ సంఘానికి చెందిన ముగ్గురు యువక్రికెటర్లు ఏకంగా భారతజట్టులోనే చోటు సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

వెస్టిండీస్ తో ఆగస్టు 3 నుంచి జరిగే తీన్మార్ టీ-20 సిరీస్ లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టులో రాజస్థాన్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ల జోడీ దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ తో పాటు…రూకీ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ సైతం చోటు సంపాదించారు.

ఐపీఎల్ గత సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన యువలెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ తన సత్తా చాటుకోడం ద్వారా.. భారతజట్టులో చోటు సంపాదించాడు.

ముంబై తరపున ఆడిన మొత్తం 13 మ్యాచ్ ల్లో 13 వికెట్లు పడగొట్టడం ద్వారా రాహుల్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు…యజువేంద్ర చహాల్ స్థానంలో భారతజట్టులో స్థానం సంపాదించాడు.

రాహుల్ చహార్ కు వరుసగా సోదరుడైన దీపక్ చహార్ సైతం …ఫాస్ట్ బౌలర్ల కోటాలో భారతజట్టులో చోటు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ గా తానేమిటో నిరూపించుకొన్న దీపక్ చహార్ కు దేశవాళీ క్రికెట్లో సైతం పలు సంచలన రికార్డులు ఉన్నాయి.

ఇక…ప్రపంచకప్ లో భారత్ నెట్ ప్రాక్టీస్ బౌలర్ గా ఉన్న ఖలీల్ అహ్మద్ సైతం లెఫ్టామ్ పేసర్ గా భారతజట్టులో చోటు సంపాదించాడు. గతంలో భారతజట్టుకు ప్రాతినిథ్యం వహించిన రికార్డు సైతం ఖలీల్ కు ఉంది.

కరీబియన్ జట్టుతో జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఈ ముగ్గురు రాజస్థానీ క్రికెటర్లు ఏరేంజ్ లో రాణించగలరన్నది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.

ఏదిఏమైనా…రాజస్థాన్ క్రికెట్ చరిత్రలోనే ముగ్గురు రాష్ట్ర్రజట్టు సభ్యులు…జాతీయజట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఇదే మొదటిసారి. ముగ్గురూ బౌలర్లే కావడం మరో విశేషం.

విండీస్ తో జరిగే టీ-20 సిరీస్ లో భారత బౌలింగ్ విభాగం భారం మూడొంతులు రాజస్థాన్ బౌలర్ల పైనే ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు.

First Published:  22 July 2019 8:40 PM GMT
Next Story