రానా కి చేసిన సర్జరీ సక్సెస్!

రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి ఇప్పటికే మీడియా లో అనేకానేక వార్తలు వచ్చాయి. కానీ రానా మాత్రం ఎప్పటికప్పుడు సైలెంట్ గా ఉంటూ, తనకి నచ్చినట్టు తన పని చేసుకుంటూ పోతున్నాడు.

అయితే ఇప్పుడు తాజా సమాచారం మేరకు… అమెరికాలో రానా కీలకమైన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు అనే ప్రచారం నడుస్తుంది. రానా కి చేసిన సర్జరీ విజయవంతం అయిందని, అది ఈ నెల 18 న చికాగో లో జరిగిందని తెలుస్తోంది.

సర్జరీ నుంచి రానా త్వరగా నే కోలుకుంటాడని వైద్యులు చెప్పారట. మరో మూడు నెలల్లో రానా తిరిగి షూటింగ్ లకి హాజరు అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ప్రస్తుతం రానా చేతిలో ఉన్న సినిమాలు విరాట పర్వం మరియు హిరణ్యకశిప.

త్వరలోనే రానా ఈ విషయాల పై ఒక అధికారిక ప్రకటన చేస్తాడేమో చూడాలి.