ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హట్‌గా సాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పించన్ల అంశంపై సభలో ఇరుపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిని సభ నుంచి సస్పెండ్ చేశారు.

ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు సభ్యులపై వేటు వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.