Telugu Global
NEWS

తెలంగాణ మంత్రుల‌పై సీఎంవో నిఘా !

తెలంగాణలో నిఘారాజ్యం న‌డుస్తోంది. ప్ర‌తీ మంత్రితో పాటు ఎమ్మెల్యేల క‌ద‌లిక‌ల‌పై నిఘా నేత్రం వెంటాడుతోంది. ఈ విష‌యం ఎవ‌రో చెప్ప‌డం లేదు. మంత్రులే స్వ‌యంగా ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. మంత్రులుగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. క‌నీసం క‌ర్టెసీ కాల్ కూడా మాట్లాడడం లేదు. ఇటీవ‌లే ఓ మంత్రి ఓ చాన‌ల్ ఇంట‌ర్వ్యూకు వెళ్లాల‌ని అనుకున్నారు. అనుకున్న‌ట్లే టైమ్ కు వ‌స్తాన‌ని మాటిచ్చారు. తీరా చూస్తే ఉద‌యం మంత్రి […]

తెలంగాణ మంత్రుల‌పై సీఎంవో నిఘా !
X

తెలంగాణలో నిఘారాజ్యం న‌డుస్తోంది. ప్ర‌తీ మంత్రితో పాటు ఎమ్మెల్యేల క‌ద‌లిక‌ల‌పై నిఘా నేత్రం వెంటాడుతోంది. ఈ విష‌యం ఎవ‌రో చెప్ప‌డం లేదు. మంత్రులే స్వ‌యంగా ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. మంత్రులుగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. క‌నీసం క‌ర్టెసీ కాల్ కూడా మాట్లాడడం లేదు.

ఇటీవ‌లే ఓ మంత్రి ఓ చాన‌ల్ ఇంట‌ర్వ్యూకు వెళ్లాల‌ని అనుకున్నారు. అనుకున్న‌ట్లే టైమ్ కు వ‌స్తాన‌ని మాటిచ్చారు. తీరా చూస్తే ఉద‌యం మంత్రి పేషీ నుంచి ఆ జ‌ర్న‌లిస్టుకు ఫోన్ వెళ్లింది, మంత్రిగారూ ఇంటర్వ్యూకు రాలేరు అని సిబ్బంది స‌మాచారం ఇచ్చారు. తీరా ఆరా తీస్తే ఏం తెలిసిందంటే…సీఎంవో నుంచి మంత్రిగారికి ఆదేశాలు వెళ్లాయ‌ని తెలుస్తోంది.

టీవీ డిబేట్ల‌కు లేదా టీవీ ఇంటర్వ్యూల‌కు వెళ్లొద్దు అనేది సీఎంవో నుంచి తాజాగా మంత్రుల‌కు వ‌చ్చిన స‌మాచారం. ఇటీవ‌ల టీవీ డిబేట్ల‌కు అధికార ప్ర‌తినిధుల‌ను కూడా పార్టీ నుంచి పంప‌డం లేదు. ఇటు కేటీఆర్‌, హ‌రీష్‌రావు,క‌విత కూడా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఎప్పుడో ఒక‌సారి మీడియాకు ఎంట్రీ. అంతే అక్క‌డ ఏ స‌మావేశం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. ప్రెస్‌నోట్ వ‌స్తే కానీ స‌మాచారం బ‌య‌ట‌కు తెలియదు.

మ‌రోవైపు టీఆర్ఎస్ భ‌వ‌న్ ద‌గ్గ‌ర కూడా మీడియాకు ఆంక్ష‌లు విధించారు. ఇన్నాళ్లు లోప‌లికి రానిచ్చేవారు. ఇప్పుడు గేటు బ‌య‌ట నిల‌బెడుతున్నారు, మొత్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కీల‌క నేత‌లు ఇంటెలిజెన్స్ స్కాన‌ర్‌లో ఉన్నారు.

మంత్రుల ఫోన్లు, కీల‌క నేత‌ల ఫోన్ల‌లో జీపీఎస్ ఆన్‌లో ఉంటే చాలు…వారు ఎక్క‌డ ఉన్నారు? వారు ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్నారు? వారి శాఖ‌ల్లో ఏం జ‌రుగుతుంది అనే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సీఎంవోకు చేరుతున్నాయ‌ట‌.

First Published:  22 July 2019 8:27 PM GMT
Next Story