అమిత్ షాతో వివేక్ భేటీ

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మరో జంపింగ్‌కు సిద్దమవుతున్నారు. చాలాకాలంగా ఒక పార్టీలో ఉండలేక పదేపదే జంప్‌లు చేస్తున్న వివేక్ ఇప్పుడు కషాయంలో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వివేక్‌ బీజేపీలో చేరుతారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా వివేక్… బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. కుమారుడుతో పాటు వెళ్లి అమిత్‌షాను కలిశారు.

తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు వివేక్. ‘ప్రజాస్వామి తెలంగాణ’ ఉద్యమం తరుపున ఫిర్యాదు చేసిన వివేక్‌… తెలంగాణలో సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని షాను కోరారు . పార్టీలో చేరికపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.ప్రస్తుతం ఆషాడ మాసం కావడంతో ఈ మాసం పోయాక వివేక్ బీజేపీలో చేరనున్నారు. అమిత్ షా వద్దకు వివేక్‌ను రాంమాధవ్‌ తీసుకెళ్లారు.